లంక పార్లమెంట్‌లో రచ్చరచ్చ.. తన్నుకున్న ఎంపీలు.. వీడియో

Thu,November 15, 2018 03:23 PM

Rival MPs in Sri Lanka Parliament exchange blows

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ రచ్చరచ్చగా మారింది. రెండు పార్టీల ఎంపీలు పిడి గుద్దులు కురిపించుకున్నారు. మూజువాణీ ఓటు ద్వారా తనను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి స్పీకర్‌కు ఎలాంటి హక్కు లేదని మహింద రాజపక్స ఆరోపించిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. రాజపక్స ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన మరుసటి రోజే పార్లమెంట్‌లో ఎంపీలు కొట్టుకోవడం విశేషం. గురువారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. దేశానికి ప్రధాని లేరు అని స్పీకర్ కారు జయసూర్య ప్రకటించారు. ఈ సమయంలో రాజపక్స జోక్యం చేసుకుంటూ.. స్పీకర్ వాదనను తప్పుబట్టారు. ఇంత ముఖ్యమైన విషయంలో ఓటింగ్ జరపాల్సింది పోయి.. మూజువాణీ ఓటు తీసుకోవడం ఏంటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.మళ్లీ ఎన్నికలు జరపాలని, సంక్షోభానికి ఇదే సరైన పరిష్కారమని రాజపక్స తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రకటపై ఓటింగ్ జరపాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. రాజపక్సకు మద్దతుగా కొందరు స్పీకర్ వైపు దూసుకెళ్లారు. సుమారు 30, 40 మంది ఎంపీలు వెల్‌లోనే కొట్టుకున్నారు. కొందరు కింద పడిపోగా.. ప్రత్యర్థి ఎంపీలు వాళ్లను తన్నారు. రాజపక్స వర్గానికి చెందిన ఎంపీలు స్పీకర్‌పైకి నీళ్ల బాటిళ్లు, బుక్కులు, చెత్త బుట్టలు విసిరేశారు. రాజపక్సను వ్యతిరేకించిన ఎంపీలు స్పీకర్‌కు రక్షణ వలయంగా నిలిచారు. సుమారు అరగంట పాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్న తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు.1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles