యాక్.. బర్గర్ బన్స్ బ్యాగ్‌లో ఎలుక.. వీడియో

Thu,June 21, 2018 01:54 PM

Restaurant employee spots mouse inside bag of burger buns

ఏంటో ఈ మధ్య ఎలుకలు బాగా ఫేమస్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. నిన్న గాక మొన్ననే కదా ఎలుకలు ఏటీఎం మిషన్‌లోకి దూరి నోట్ల కట్టలను ముక్కలు ముక్కలుగా చేశాయని చదువుకున్నాం కదా. మళ్లీ ఇప్పుడు ఇంకో చిట్టెలుక తిన్నగా బర్గర్ బన్స్ ప్యాకెట్‌లోకి దూరింది. ఇంకో విషయం ఏంటో తెలుసా? అది బతికే ఉంది. అవును.. యూఎస్‌లోని ఒక్లహోమా, కటూసాలో ఉన్న వెండీ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.

బర్గర్స్ తయారు చేయడానికి వచ్చే బన్స్ ప్యాకెట్లలోని ఓ ప్యాకెట్‌లో ఎలుక దర్శనమిచ్చింది. దీన్ని గమనించిన కిచెన్ సిబ్బంది ఒక్కసారిగా అరిచారు. దీంతో రెస్టారెంట్‌లోనే పనిచేస్తున్న స్కై ఫ్రేమ్ అనే మహిళ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాదు.. వెండీ రెస్టారెంట్‌లో ఏదీ తినకండి.. అంటూ క్యాప్సన్ కూడా పెట్టింది. ఆ వీడియోతో పాటు టేబుల్ మీద సిగిరేట్ పడి ఉన్న మరో ఫోటోను షేర్ చేస్తూ.. కిచెన్ ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండి అంటూ ఆ ఉద్యోగిని క్యాప్సన్ పెట్టడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యం.. వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది.

1887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles