వీడియో: హెల్మెట్‌లో దూరిన పాము!

Sat,January 20, 2018 01:27 PM

red bellied snake hid inside firefighter helmet in Australia

ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసే ఉంటారు. కారు టైరులో, ఇంట్లో, చివరకు షూలో కూడా దూరిన పాముల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు హెల్మెట్ వంతు. అవును.. ఓ విషపూరితమైన పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అగ్ని మాపక సిబ్బంది ధరించే హెల్మెట్‌లో అది దూరింది. అయితే.. దాన్ని పెట్టుకోకముందే అందులో ఉన్న పామును గమనించిన ఆ వ్యక్తి వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఆ పామును హెల్మెట్‌లో నుంచి బయటికి తీసి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేసింది.

ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో ఈ జాతి పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయట. దాని పేరు రెడ్ బెల్లీడ్ స్నేక్ అట. చాలా విషపూరితమైన పామే నట అది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న రూథర్‌పార్డ్ ఫైర్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. గత వారం అదే న్యూ సౌత్ వేల్స్‌లో ఇదే జాతి పాము ఓ కారు విండో మీదికి ఎక్కింది. ఆ పాము ఏకంగా 8 అడుగుల పొడవు ఉంది. అయితే.. కారు విండో డోర్స్ మూసి ఉండటంతో అది లోపలికి వెళ్లలేకపోయింది. వెంటనే దాన్ని గమనించిన కారు ఓనర్.. రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో వాళ్లు దాన్ని పట్టుకెళ్లారు. అయితే.. ఈ విషపూరితమైన పాములు ఎక్కడపడితే అక్కడ దూరుతుండటంతో ఆస్ట్రేలియాలో జనాలు కొంచెం బెరుకుగానే ఉంటున్నారట.

ఇక.. హెల్మెట్ లో దూరిన పాము వీడియో మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నది.

4695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles