క‌న్నీళ్ల‌ను దిగ‌మింగుకొని జీవితంలో పైకొచ్చిన ఈ అబ్బాయి స్టోరీ మీరు చ‌ద‌వాల్సిందే!

Thu,June 1, 2017 02:40 PM

బంగ్లాదేశ్: ఇది ఒక అబ్బాయి రియ‌ల్ స్టోరీ.. అంతే కాదు మ‌నంద‌రికీ స్ఫూర్తివంత‌మైన, ఆద‌ర్శ‌మైన స్టోరీ. బంగ్లాదేశ్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న కు సంబంధించిన ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వైర‌ల్ పోస్ట్. ఆ అబ్బాయి మాట‌ల్లోనే ఈ పోస్టును మ‌న‌మూ చ‌దువుదాం ప‌దండి.


"నాకు షూ పాలిష్ ఎలా చేయాలో తెలియదు. మా నాన్న షూ పాలిష్ చేస్తూ మ‌మ్మ‌ల్ని సాదేవాడు. అయితే.. ఇప్పుడు మా నాన్న లేడు. ఆయ‌న చ‌నిపోయాడు. మా అమ్మ ఏ ప‌నీ చేయ‌లేదు. ఇద్ద‌రు త‌మ్మ‌ళ్లు, ఒక అక్క‌ను చ‌దివించాలి. చేతిలో చిల్లి గ‌వ్వ లేదు. అందుకే.. నాన్న లాగే నేనూ షూ పాలిష్ చేసి నా ఫ్యామిలీని పోషించాల‌నుకున్నాను.

మా నాన్న వ‌ర్క్ చేసే బ్రిడ్జ్ ద‌గ్గ‌రే నేను కూడా షూ పాలిష్ సామాను తో కూర్చున్నాను. నాకు షూ పాలిష్ ఎలా చేయాలో తెలియ‌దు. మొద‌టి క‌స్ట‌మ‌ర్ వ‌చ్చాడు. షూ పాలిష్ చేయ‌మ‌న్నాడు. షూ పాలిష్ చేస్తుంటే నా చేతులు వ‌ణికాయి. వెంట‌నే బ్ల‌డీ కోబ్ల‌ర్ అంటూ నామీద అరిచి షూ లాక్కొని డ‌బ్బులివ్వ‌కుండానే అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. నాకు క‌న్నీళ్లు ఆగ‌లేదు. నా ప‌క్కనే ఉన్న వేరే హాకర్స్ నావైపు జాలి గా చూశారు. నాకు స్కూల్ కు వెళ్లాల‌నిపించింది. నాన్న బ‌తికున్న‌ప్పుడు ఇక్క‌డ చ‌దివిన ప‌ద్యాలు గుర్తుకు వ‌చ్చాయి. అంత‌లోనే మ‌రో వ్య‌క్తి వ‌చ్చాడు. ఆయ‌న్ని చూస్తేనే నాకు భ‌య‌మేసింది. ఆయ‌న వాయిస్ కూడా చాలా క‌ఠినంగా ఉంది. షూ త‌ళ‌త‌ళా మెరిసేలా పాలిష్ చేయాల‌ని ఆర్డ‌రేశాడు ఆ వ్య‌క్తి. నా క‌న్నీళ్ల‌ను ఆపుకొని షూ పాలిష్ చేయ‌డం ప్రారంభించాను. పాలిష్ అయిపోయిన త‌ర్వాత మళ్లీ చేయాల‌న్నాడు ఆ వ్యక్తి. మ‌ళ్లీ చేసిచ్చాను. లేదు.. మళ్లీ పాలిష్ చేయాల‌న్నాడు. అలా.. పాలిష్ చేయ‌గా చేయ‌గా త‌ళ‌త‌ళ‌లాడుతూ మెరిసి పోయింది షూ.

వెంట‌నే నా జేబులో 100 టాకాలు(బంగ్లాదేశ్ క‌రెన్సీ) పెట్టి ఇలా అన్నాడు. నీ టైమ్, ఎన‌ర్జీని ప‌ని కోసం ఉప‌యోగించు కాని.. ఏడ‌వ‌డానికి కాదు, క‌న్నీళ్లు నీకు ఏమీ తీసుకురావు.. అని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజు నేను దాదాపు 300 టాకాలు సంపాదించాను. గ‌త మూడు సంవ‌త్స‌రాల నుంచి నేను షూ పాలిషింగ్ చేస్తున్నాను. ఇక అప్ప‌టి నుంచి ఏడ‌వ‌డానికి నా టైమ్ ను ఎప్పుడూ వేస్ట్ చేయ‌లేదు. నా అక్క‌కు పెళ్లి చేశాను. ఇద్ద‌రు త‌మ్ముళ్ల‌ను చ‌దివిస్తున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీ తో చాలా సంతోషంగా ఉంటున్నాను. ఇప్పుడు ఎవ‌రైనా కోబ్ల‌ర్ అంటూ పిలిచినా నేను వాళ్ల వైపు చూసి చిన్న‌గా న‌వ్వుతాను అంతే."

2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles