పాముని కిస్ చేయబోతే..కాటేసింది..వీడియో

Fri,May 19, 2017 10:30 PM


న్యూయార్క్‌: ఓ వ్యక్తి ఏకంగా రాటిల్‌స్నేక్‌ను కిస్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాలమీదకి తెచ్చుకున్నాడు. ఈ ఘటన న్యూయార్క్‌లోని పుత్నం కౌంటీలో జరిగింది. రాన్ రీనాల్డ్ అనే వ్యక్తి పాముకి ముద్దుపెడుతానంటూ దానిని పట్టుకున్నాడు. పామును కిస్ చేసేందుకు ప్రయత్నించగా..అది అతని నాలుకపై కాటు వేసింది.

సమాచారమందుకున్న అధికారులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాన్ రీనాల్డ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ‘రాన్ రీనాల్డ్ పామును చేతిలోకి తీసుకున్నపుడు అది చాలా నిశ్శబ్ధంగా ఉంది. పామును పట్టుకునేటపుడు రాన్ రీనాల్డ్ కొద్దిగా తాగి ఉన్నాడు. అతడు పామును కిస్ చేస్తానని ప్రయత్నం చేసేటపుడు అది నాలుకపై కాటేసిందని’ అతని సన్నిహితుడొకరు చెప్పాడు.

648

More News