గోడల మధ్య చిక్కుకున్న అరుదైన పులిని కాపాడారు

Sat,November 17, 2018 04:03 PM

RARE SUMATRAN TIGER RESCUED

ఓ అరుదైన సుమాత్రా జాతికి చెందిన పెద్దపులి జనావాసాల మధ్యలోకి వచ్చింది. భయంతో రెండు ఇళ్లమధ్య చేరింది. 30 అంగుళాల సందు మాత్రమే ఉంది. అందులో చిక్కుకుని మూలుగుతూ కూర్చున్నది. ఇండోనేషియాలోని పెకాన్‌బారు పట్టణంలో ఈ ఘటన జరిగింది. పులిని ఆ గోస నుంచి కాపాడేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. కానీ ఇరుకైన ప్రదేశం కావడంతో ఏమీచేయలేని పరిస్థితి. చూస్తుండగా మూడు రోజులు గడిచిపోయాయి. నిజానికి అంతకముందు అది ఓ షాపులో దూరింది. అక్కడ నుంచి తప్పించుకుని ఇరుకైన సందులో దూరింది.

ముందుగా దానిపైకి మత్తుమందు సిరంజీని పేల్చి అది నిద్రపోయేలా చేశారు. ఆ తర్వాత గోడలను కట్ చేసి 80 కిలోల ఆ పులిని సురక్షితంగా బయటకు తీశారు. దాని ఒంటికైన గాయాలకు, ఒకటిరెండు దంతాలు కూడా దెబ్బ తినడంతో వాటికీ చికిత్స చేశారు. ప్రస్తుతం సుమాత్రా అడవుల్లో 400 వరకు పులులు మాత్రమే ఉన్నాయి.

2231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles