పైనుంచి పైథాన్ పడడంతో పరుగులు పెట్టారు.. వీడియో

Mon,October 15, 2018 01:13 PM

Python Falls From Ceiling During Staff Meeting In China

చైనా నాన్నింగ్ సిటీలోని ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంకు సిబ్బంది గత శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశం జరుగుతుండగా.. ఆ గదిలోని పైకప్పు నుంచి ఐదు అడుగుల పైథాన్ కిందపడిపోయింది. ఇద్దరు ఉద్యోగుల మధ్య పైథాన్ పడడంతో.. సిబ్బంది అందరూ భయంతో పరుగులు పెట్టారు. ఆ పైథాన్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మొత్తానికి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో.. బ్యాంకు వద్దకు చేరుకున్న వారు.. చివరకు పైథాన్‌ను పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ వీడియో చైనాలో వైరల్ అయింది. మిలియన్ల సంఖ్యలో ఈ వీడియోను చూశారు.

3467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles