పక్షిని మింగడానికి అపసోపాలు పడ్డ కొండచిలువ.. వీడియో

Fri,February 22, 2019 06:08 PM

Python eats bird on TV Antenna video goes viral

కొండచిలువ.. ఎంతటి జంతువునైనా తినేయగలననే విశ్వాసం దానిది. అందుకే.. దానికి ఏది దొరికినా.. దాన్ని వదలకుండా.. మింగేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. ఒక్కోసారి తన కంటే పెద్ద జంతువులు, పక్షులను కూడా మింగడానికి ప్రయత్నిస్తుంటుంది కొండచిలువ. తాజాగా ఓ కొండ చిలువ కూడా ఇలాగే ఓ పక్షిని మింగేయబోయింది. పక్షి చూస్తే కాస్త పెద్దగానే ఉంది. అది తన నోట్లో పట్టడం లేదు. ఓ ఇంటిపైన ఉన్న టీవీ యాంటీనా మీద ఉన్న కుర్రవాంగ్ అనే పక్షిని పట్టేసింది కొండచిలువ. దాన్ని నోటితో పట్టి చంపేసింది. ఆ తర్వాత దాన్ని మింగడానికి తెగ ఆయాస పడింది. అది దాన్ని మింగడం కోసం పడుతున్న అవస్థలను ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కింగ్స్‌క్లిప్‌లో చోటు చేసుకున్నది.

4669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles