రష్యా జోక్యం నిజమే.. పుతిన్‌దే ఆ బాధ్యత: ట్రంప్

Thu,July 19, 2018 07:25 AM

Putin personally responsible for Moscows attempts to interfere in US elections, says trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూటకో మాట మాట్లాడుతున్నారు. 2016లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న అంశంపై మాటిమాటికీ మాటమారుస్తున్నారు. తాజాగా సీబీఎస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోనాల్డ్ ట్రంప్ కొత్త ఆరోపణ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందుని, దానికి పుతిన్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రంప్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మూడు రోజుల క్రితం హెల్సింకీలో కలిసిన ట్రంప్ ఆ తర్వాత ఎన్నికల అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఏం జరిగినా ఆ బాధ్యతను నేను తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే రష్యాకు పుతినే అధ్యక్షుడు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న అంశంలోనూ ఆయన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ ఇంటర్వ్యూలో తెలిపారు.

వాస్తవానికి అమెరికా ఇంటెలిజెన్స్ ఇటీవల ఎన్నికల అంశంపై ఓ రిపోర్ట్‌ను ఇచ్చింది. అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ తన రిపోర్ట్‌లో పేర్కొన్నది. ఆ రిపోర్ట్‌ను సమర్థిస్తూనే.. దానికి పుతిన్‌కు ఎటువంటి సంబంధం లేదని ట్రంప్ మొదట పేర్కొన్నారు. అంతేకాదు హెల్సింకీలో పుతిన్‌ను కలవడం వల్లట్రంప్ వైఖరిపై ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. పుతిన్ అబద్దం ఆడుతున్నారా అన్న అంశాన్ని తాను సమర్థించలేనని ట్రంప్ అన్నారు. దేశాధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీమ్‌తో రష్యా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో ఆ కమిటీ దర్యాప్తు చేపట్టింది. అయితే రాబర్ట్‌తో ఎన్నికల అంశంపై మాట్లాడనున్నట్లు ట్రంప్ తెలిపారు.

ట్రంప్ అభిప్రాయాలు ఎలా ఉన్నా.. వైట్‌హౌజ్ మాత్రం స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. అమెరికాకు రష్యా వల్ల ప్రమాదం ఉందని వైట్‌హౌజ్ వెల్లడించింది. అమెరికాను రష్యా టార్గెట్ చేస్తుందా అని ఇంట్వర్య్యూలో అడిగిన ప్రశ్నకు మాత్రం ట్రంన్ నో అని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా సాండర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. రష్యా జోక్యాన్ని అడ్డుకునేందుకు ప్రెసిడెంట్ ప్రయత్నిస్తున్నారని సాండర్స్ తెలిపారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles