'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. వినూత్నంగా ట్రై చేశాడు.. పడిపోయింది..!

Fri,February 22, 2019 04:57 PM

Proposal Message marry me In Snow wins the heart of the girl in chicago

ఈరోజుల్లో అమ్మాయిలను పడేయాలంటే చాలా కష్టం. వాళ్ల కోసం కొండ మీది నుంచి కోతిని తీసుకొచ్చినా.. ఊహుం.. నచ్చరు. అస్సలు వాళ్లను ఎలా పడేయాలో తెలియక కుర్రాళ్లు పిచ్చోళ్లవుతున్నారు. అందుకే కొందరు యువకులు తమ బుర్రకు సాన పట్టి కొత్త కొత్త ఐడియాలో వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిలను ప‌డేస్తున్నారు. ఇప్పుడు మనం చదవబోయే స్టోరీ కూడా అటువంటిదే. మీరు పైన ఫోటో చూస్తున్నారు కదా. మంచులో 'మ్యారీ మీ..' అని రాసి ఉంది కదా. అది కూడా ప్రపోజల్ కోసమే. అవును.. చికాగోకు చెందిన బాబ్ లెంపా వ్యక్తి ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేయడానికి చికాగోలోని మ్యాగీ డాలే పార్క్‌ను ఎంచుకున్నాడు.

తన గర్ల్‌ఫ్రెండ్ పెగ్గీ బేకర్ డాలే పార్క్‌కు సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో 37వ ఫ్లోర్‌లో ఉంటుందట. దీంతో తనకు 37వ ఫ్లోర్ నుంచి చూసినా తన ప్రపోజల్ మెసేజ్ కనిపించాలని... 45 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పుతో 'మ్యారీ మీ' అనే మెసేజ్‌ను మంచులో తయారు చేశాడు. దాన్ని గీయడానికి మనోడికి 6 గంటల సమయం పట్టిందట.


చాలామంది దాన్ని గమనించినా.. అంతగా పట్టించుకోలేదట అతడి గర్ల్‌ఫ్రెండ్. తర్వాత తను కూడా చూసి.. వామ్మో ఇంత పెద్దగా ఎవరు గీశారని అనుకుందట కానీ.. అది తనకోసమే అని మాత్రం అనుకోలేదట. తర్వాత ఆ ప్రపోజల్ తనకోసమే అని తెలిసి భావోద్వేగానికి గురైందట పెగ్గీ. అనంత‌రం తన బోయ్‌ఫ్రెండ్‌కు ఎస్ చెప్పేసిందట. దీంతో వాళ్లిద్దరూ ఒక్కటయిపోయారు. ఇక.. ఈ ప్రపోజల్ మెసేజ్‌ను పార్క్ సిబ్బంది ఫోటో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి అతడి ప్రపోజల్, దానికి ఆ యువతి ఒప్పుకోవడం.. మీరెప్పుడైనా చికాగో పార్క్‌లో ప్ర‌పోజ్ చేశారా? అంటూ వాళ్లు క్యాప్ష‌న్ పెట్ట‌డంతో.. ఆ ఫోటోతో పాటు... వాళ్ల స్టోరీ కూడా వైరల్‌గా మారింది.

8719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles