బ్రిటన్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ కారుకు ప్రమాదం

Fri,January 18, 2019 03:08 PM

Prince Philip in car accident but not injured

బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ (97) కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న వాహనం ఆయన కారును ఢీకొన్నది. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రిన్స్ ఫిలిప్‌కు ఎలాంటి గాయాలు తగులలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని బకింగ్‌హామ్ వర్గాలు తెలిపాయి. రాజదంపతులు తరచుగా విడిచేసే సాండింగ్రామ్ ఎస్టేట్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రిన్స్ నడుపుతున్న ల్యాండ్‌రోవర్, అవతలి నుంచి వచ్చిన కియా కార్లు ఢీకొన్నాయి. రెండు కార్ల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరూ మద్యం తాగి కారు నడపడం లేదని తేలిందని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రిన్స్‌కు వైద్య పరీక్షలు జరిపి ఆయనకు ఎలాంటి గాయాలు తగులలేదని ధృవీకరించుకున్నారు. అవతలి కారులోని మహిళా డ్రైవరుకు ఒళ్లు అక్కడక్కడా చీరుకుపోయింది. కారులోని మరో వ్యక్తికి చేతి ఫ్రాక్చర్ అయింది. ఇద్దరికీ ఆస్పత్రిలో చికిత్స అవసరమని పోలీసులు చెప్పారు. సెంచరీవైపు అడుగులేస్తున్న ప్రిన్స్ ఫిలిప్ ఇప్పటికీ కారు నడపడంపై ఆసక్తి కనబరుస్తారు. దేశదేశాల అధినేతలు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా వారిని కారులో తిప్పుతారు.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles