సమోసా దొంగిలించిన ప్రిన్స్.. వీడియో

Tue,September 25, 2018 03:05 PM

Prince Harry steals a Samosa from an event organised by his wife Meghan Markle

లండన్: సమోసా అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి.. ఫేమస్ ఇండియన్ స్నాక్స్‌లో ఇదీ ఒకటి. ఈ సమోసాపై బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ మనసు పారేసుకున్నాడు. తన భార్య మేగన్ మార్కెల్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్‌లో హ్యారీ ఓ సమోసాను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కాడు. ఎవరూ చూడని సమయంలో సమోసా ప్లేట్‌ను తీసుకొని తన వెనుకాల దాచుకున్నాడు. అయితే ఆ సమయంలో ఓ కెమెరా తనను ఫాలో అవుతున్న విషయాన్ని హ్యారీ గుర్తించలేకపోయాడు. కొంతసేపటి తర్వాతగానీ ఆ కెమెరా ఉన్నట్లు హ్యారీ పసిగట్టలేకపోయాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో కెమెరా వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వాడతడు. ఆ సమోసాను తన వెంట తీసుకొని రాయల్ కుటుంబానికి కేటాయించే కారులో హ్యారీ వెళ్లిపోయాడు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత మేగన్ ఆర్గనైజ్ చేసిన తొలి ఈవెంట్ ఇది. ఓ కమ్యూనిటీ కిచెన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా కెన్సింగ్టన్ ప్యాలస్‌లో ఆమె ఈ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హ్యారీ సమోసా దొంగతనం చేసిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్‌గా మారిపోయింది. ఇప్పటికే కొన్ని లక్షలసార్లు ఈ వీడియోను రీట్వీట్ చేశారు.


3227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles