రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌కు ఆస్ట్రేలియా గ‌న్ సెల్యూట్‌

Thu,November 22, 2018 09:35 AM

President Ram Nath Kovind receives Guard of Honour in Sydney

క్యాన‌బెరా: భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆస్ట్రేలియాలో ఘ‌నంగా సైనిక వంద‌నం ల‌భించింది. సిడ్నీలోని అడ్మిరాల్టీ హౌజ్‌లో రామ్‌నాథ్ గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. గ‌న్ సెల్యూట్ మ‌ధ్య వంద‌నం స్వీక‌రించ‌డం చాలా అరుదైన ఘ‌ట‌న‌. అంత‌కుముందు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌.. ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ జాన్ మారిస‌న్‌ను క‌లిశారు. ఫ‌స్ట్ లేడీ స‌వితా కోవింద్ కూడా ఆ దేశ గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ స‌ర్ పీట‌ర్ కాస్‌గ్రోవ్‌ను కూడా క‌లుసుకున్నారు. ఆస్ట్రేలియాలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్‌.. నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ఇవాళ రెండ‌వ రోజు అనేక మంది కీల‌క నేత‌ల‌ను ఆయ‌న క‌లుసుకోనున్నారు. ఆ త‌ర్వాత రామ్‌నాథ్ ఓ క‌మ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొన‌నున్నారు. అక్క‌డే మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాన్ని కూడా ఆవిష్క‌రిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆసీస్ ప్ర‌ధాని మారిస‌న్ కూడా పాల్గొంటారు. ఆ త‌ర్వాత వ్యాపార‌వేత్త‌ల స‌ద‌స్సుకూ రామ్‌నాథ్ హాజ‌ర‌వుతారు.

1327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles