సుడిగాలుల్లో చిక్కుకున్న వ్యక్తి.. గిరగిరా ఎలా తిరిగాడో చూడండి..!

Fri,April 12, 2019 04:09 PM

Powerful Dust Devil Blows Off Roof and Twirls Man video goes viral

ఇది ఎండాకాలం. ఈ కాలంలో గాలి దుమారం, సుడిగాలులు సహజం. ఊళ్లలో ఇప్పటికీ సుడిగాలులు వస్తే ఆ సుడిగాలి మధ్యలో దెయ్యం ఉంటుందని.. అది లాక్కెళ్లిపోతుందని భయపడుతుంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. అవును.. కాలిఫోర్నియాలోని ఫెయిర్‌ఫీల్డ్ సిటీలో విపరీతంగా గాలిదుమారం వచ్చింది. వెంటనే సుడిగాలులు వీచాయి.

అప్పటికే గాలిదుమారాన్ని తట్టుకోలేక ఎక్కడి వారు అక్కడే తలదాచుకున్నారు. ఓ వ్యక్తి మాత్రం ఆ.. ఏమౌతుందిలే అనుకొని లైట్ తీసుకున్నాడు. కానీ.. సుడిగాలి మాత్రం అతడిని వదల్లేదు. అతడిని లాక్కుంది. గిరగిరా తిప్పేసింది. తర్వాత వదిలేసింది. ఈ ఘటన ఫెయిర్‌ఫీల్డ్ సిటీలోని అలన్ విట్ పార్క్‌లో చోటు చేసుకున్నది. పార్క్‌లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. సుడిగాలి వచ్చిన సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంటి పైకప్పు అమాంతం లేచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఫెయిర్‌ఫీల్డ్ ప్రభుత్వం తమ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

5075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles