పెరూలో భారీ భూకంపం : ఒకరు మృతి

Mon,May 27, 2019 11:08 AM

Powerful 8 magnitude earthquake kills 1 in Peru

లిమా : సౌతాఫ్రికాలోని పెరూలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. ఈ భూకంప ధాటికి ఒకరు మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని డారియో మునోజ్(48)గా అక్కడి అధికారులు గుర్తించారు. 130 భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇందులో స్కూళ్లు, ఆస్పత్రులు, చర్చిలు ఉన్నాయని తెలిపారు. 62 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 1250 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భూకంప తీవ్రత ప్రభావం పొరుగు దేశాలైన ఈక్వాడార్, కొలంబియా, బ్రెజిల్, బొలివియాపై పడింది.


710
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles