పేలిన పవర్ బ్యాంకు.. తప్పిన ప్రమాదం.. వీడియో

Mon,June 11, 2018 03:12 PM

Power Bank exploded in man bag in china

ఈరోజుల్లో తిండి లేకుండానైనా ఉంటారేమో కాని.. ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ ఉండాల్సిందే. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్‌స్టంట్ చార్జర్ అన్నమాట. ఇక.. అసలు విషయానికి వస్తే.. ఓ వ్యక్తి పవర్ బ్యాంకును బ్యాగ్‌లో వేసుకొని బస్సులో కూర్చున్నాడు. అంతే క్షణాల్లో బ్యాగ్‌లోని పవర్ బ్యాంకు బాంబు పేలినట్లు పేలింది. దీంతో ఆ వ్యక్తికి, బ్యాగుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆ బ్యాగును కింద పడేయడంతో మనోడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన చైనాలోని గాంగ్జు సిటీలో చోటు చేసుకున్నది.

ఈ ఘటన బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నది. గత వారం ముంబైలోని బాండుప్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఫోన్ పేలి ఓ కస్టమర్‌కు గాయాలయిన సంగతి తెలిసిందే.

4136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles