జాక్‌పాట్ అంటే ఇదీ.. ఆ లాటరీ విలువ 12 వేల కోట్లు!

Sun,October 21, 2018 02:57 PM

న్యూయార్క్: నిజమే.. ఆ లాటరీ విలువ 160 కోట్ల డాలర్లు (సుమారు రూ.11756 కోట్లు). అమెరికా లాటరీ చరిత్రలోనే ఇది అతి పెద్ద మొత్తం. వచ్చే మంగళవారం మెగా మిలియన్స్ డ్రాలో ఈ మొత్తం అందుబాటులో ఉండనుంది. గత శుక్రవారం నిర్వహించిన డ్రాలో ఎవరూ దీనిని గెలుచుకోలేకపోయారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రాలో ఎవరూ 15, 23, 53, 65, 70, మెగా బాల్ 7 నంబర్లను అందుకోలేకపోయారు. ఇప్పుడు మంగళవారం నిర్వహించబోయే డ్రాలో ఎవరైనా ప్లేయర్ ఈ ఆరు నంబర్లను సాధించగలిగితే ఈ జాక్‌పాట్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే వాళ్లకు ప్రైజ్‌మనీ రెండు విధాలుగా అందుబాటులో ఉంటుంది. అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే 90.4 కోట్ల డాలర్లు (సుమారు రూ.6600 కోట్లు) ఇస్తారు.

లేదా 160 కోట్ల మొత్తాన్ని రానున్న 29 ఏళ్లలో విడతల వారీగా అందజేస్తారు. పవర్‌బాల్ అమెరికా చరిత్రలోనే అతి పెద్ద లాటరీ ప్రైజ్‌మనీ అందిస్తుంది. గతంలో 2016లో అత్యధికంగా 158 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ అందించింది. మెగా మిలియన్స్ టికెట్లను అమెరికాలోని 44 రాష్ర్టాలతోపాటు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, వర్జిన్ ఐలాండ్స్‌లో అమ్ముతారు. ఒకరి కంటే ఎక్కువ విజేతలు వస్తే ప్రైజ్‌మనీని సమానంగా పంచుతారు. మొత్తం 24 మెగా మిలియన్స్ డ్రాలలో జులై 24 నుంచి ఒక్క టాప్ విన్నర్ కూడా లేడు. మెగా మిలియన్స్ జాక్‌పాట్‌ను గెలిచే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది.

7662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles