రోడ్డు పక్కన ఉన్న బిల్‌బోర్డ్‌పై ప్రత్యక్షమైన పోర్న్ వీడియో

Wed,March 21, 2018 03:23 PM

Porn played out on billboard near busy highway in Philippines

అది ఫిలిప్పైన్స్‌లోని మకాటి సిటి. అక్కడే ఉన్న ఓ బిజీ హైవేపై వాహనాలు వెళ్తున్నాయి. అయితే.. ఆ హైవేపై కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ బిల్‌బోర్డులను అమర్చారు. ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడానికి వాటిని ఉపయోగిస్తారు. అయితే.. ఆ హైవేపై ఉన్న ఓ బిల్‌బోర్డులో ట్రాఫిక్ రూల్స్‌కు బదులు పోర్న్ వీడియో ప్రసారమైంది. దాదాపు 30 సెకండ్ల పాటు పోర్న్ వీడియో బిల్‌బోర్డ్‌పై ప్లే అయింది. దీంతో ఒక్కసారిగా షాకయిన వాహనదారులు వాహనాలను ఆపి మరీ ఆ వీడియోను తిలకించారు. అంతే కాదు.. తమ కెమెరాలకు పని చెప్పి ఆ వీడియోను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం కాస్త.. ఫిలిప్పైన్స్ మేయర్‌కు తెలియడంతో ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. నిజానికి ఫిలిప్పైన్స్‌లో పోర్న్‌ను నిషేధించారు. అయినప్పటికీ.. ఇలా బిల్‌బోర్డ్‌పై పోర్న్ క్లిప్ ప్రత్యక్షమవడంతో అక్కడ ఈ ఘటన చర్చనీయాంశమైంది.

5820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles