ఆమెను అరెస్ట్ చేద్దామా.. వద్దా.. టాస్ వేద్దాం.. వీడియో

Sun,July 15, 2018 05:20 PM

Police Officers in America flips a coin to decide whether to arrest a woman or not

జార్జియా: అమెరికాలో ఇద్దరు మహిళా పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. దీనికి కారణం ఓ మహిళను అరెస్ట్ చేసే విషయంలో ఆ ఇద్దరు పోలీసులు టాస్ వేయాలని నిర్ణయించడమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో 24 ఏళ్ల సారా వెబ్ అనే మహిళ ఆఫీస్‌కు లేటవుతున్నదంటూ పరిమితి కన్నా ఎక్కువ వేగం (గంటకు 130 కి.మీ.)తో కారును నడిపించింది. ఆ సమయంలో వర్షం కూడా కురుస్తున్నది. దీంతో ఇద్దరు పోలీసులు ఆమెను ఆపారు. ఆమెను అరెస్ట్ చేయాలా లేక ఓ స్పీడింగ్ టికెట్ ఇచ్చి వదిలేయాలా అన్న విషయంపై ఇద్దరు పోలీసుల మధ్య చర్చ జరిగింది. దీనికోసం వాళ్లు టాస్ వేయాలని నిర్ణయించారు. హెడ్స్ పడితే అరెస్ట్ చేద్దాం.. టెయిల్స్ పడితే వదిలేద్దాం అనుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో అంతా రికార్డయింది. ఆ వీడియోను స్థానిక చానెల్స్ ప్రసారం చేశాయి. దీంతో రోజ్‌వెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ పోలీసులను సస్పెండ్ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన కౌర్ట్నీ బ్రౌన్ తన మొబైల్ ఫోన్‌లో కాయిన్ ఫ్లిప్ యాప్‌లో టాస్ వేసింది. అదికాస్తా సారా వెబ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఇదంతా వీడియోలో రికార్డవడంతో దానిని ఆధారంగా చేసుకొని సారా పోలీసులను సవాలు చేసింది. దీంతో ఈ నెల 9న ఓ కోర్టు ఆమెపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టేశారు. ఆ పోలీసులను సస్పెండ్ చేశారు.

7067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS