ఆయుధాల కోసం వెళ్తే మొసలి దొరికింది!

Mon,January 22, 2018 05:15 PM

police find 2 metre crocodile in house Basement in saint petersburg

ఒక పని కోసం వెళ్తే మరో పని అయిందన్న చందంగా పోలీసులు ఆయుధాల కోసం వెళ్తే మొసలి దొరికింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ఇంట్లో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. వాటిని అక్రమంగా పీటర్స్‌బర్గ్ దగ్గర్లోని పీటర్‌గాఫ్‌లో అతడు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు పక్కా సమాచారంతో ఆ వ్యక్తి ఇంట్లో రైడ్ నిర్వహించారు.

అయితే.. అక్కడే పోలీసులు విస్తుపోయే ఘటన ఒకటి జరిగింది. ఆ ఇంటి బేస్‌మెంట్ కింద ఏకంగా రెండు మీటర్లు ఉన్న మొసలి వారి కంటపడింది. దెబ్బకు ఠారెత్తిన పోలీసులు ఆ మెసలిని స్వాధీనం చేసుకొని దాన్ని అక్కడి నుంచి తరలించారు. పోలీసులకు ఆ సెర్చ్‌లో మొసలితో పాటు ఆయుధాలను పోలి ఉన్న కొన్ని వస్తువులు దొరికాయి. వాటిని కూడా స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపించి.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

"ఆ మొసలి 2005 నుంచి ఆ ఇంట్లోనే ఉంది. బేస్‌మెంట్ కింద ఉన్న బురద గుంటలో అది ఉంటుంది. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ఎవరికీ అక్కడ మొసలి ఉందన్న సంగతే తెలియలేదు.." అని ఆ ఇంటి పొరుగున ఉండే ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.

8275
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles