ఇళ్లపై దాడి చేస్తున్న ధృవపు ఎలుగుబంట్లు.. షాకింగ్ వీడియో

Tue,February 12, 2019 02:01 PM

Polar Bears entering the homes of Russian Islands

మాస్కో: మన దగ్గర అప్పుడప్పుడూ పులులు ఇళ్ల మధ్యకు వచ్చి భయపెడతుంటాయి కదా. అలాగే ఇప్పుడు రష్యాలోని కొన్ని దీవులను ధృవపు ఎలుగుబంట్లు వణికిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఎలుగుబంట్లు ఇళ్ల మధ్యకు వస్తున్నాయి. దీంతో అక్కడ ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ధృవపు ఎలుగుబంట్లు ఎప్పుడూ దాడి చేయలేదు. అవి ఒకరకంగా ఇక్కడి ప్రజల వెంట పడుతున్నాయి అని స్థానిక పాలకవర్గ ఇన్‌చార్జ్ ఝింగాషా మూసిన్ చెప్పారు. ఉత్తర రష్యాలోని నొవాయా జెమ్‌ల్యా ప్రాంతంలో 50 వరకు ఎలుగుబంట్లు కనిపించాయి. అందులో ఐదు ఎలుగుబంట్లు స్థానిక మిలిటరీ, భద్రతా బలగాల స్థావరాల్లోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీస్ ప్యాట్రోల్స్‌కు కూడా ఇవి భయపడటం లేదని, వాటిని తరిమేయాలంటే పెద్ద ఎత్తున ఇతర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని స్థానిక అధికారులు చెబుతున్నారు. వాటిని కాల్చకూడదన్న ఆదేశాలు ఉండటంతో.. మరో రకంగా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం నిపుణులు రంగంలోకి దిగారు. అయితే ఈ చర్యలు సరిపోకపోతే వాటిని చంపాల్సి వస్తుందని కూడా అధికారులు స్పష్టం చేశారు.


1602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles