రక్తపు మడుగులో ఉన్న పులిపై కూర్చొని పిడికిలితో.. ఫోటోలు

Wed,January 23, 2019 06:13 PM

అసలే ఈ ప్రపంచాన్ని పర్యావరణ కాలుష్యం కలిచివేస్తోంది. దానికి తోడు అడవిలోని జంతువులన్నీ అంతరించిపోతుండటంతో జీవవైవిధ్యం కూడా దెబ్బతింటోంది. అడవిలోని జంతువులను మనుషులు చంపేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన జంతువులు మనుషుల వల్లనో లేక ఇతర కారణాల వల్లనో మృత్యువాతపడుతుండటం జీవి వైవిధ్యానికి చాలా ప్రమాదం. అందుకే.. అంతరించి పోతున్న జంతువులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలా అయితేనే మనిషి మనుగడ సాధ్యమౌతుంది. లేదంటే కొన్నేళ్లలో మనిషి మనుగడ కూడా అసాధ్యమే.

అయితే.. డబ్బు మాయలో పడిపోయి.. కొంతమంది వేటగాళ్లు అరుదైన జాతి జంతువులను బలి తీసుకుంటున్నారు. మీరు పైన చూస్తున్న ఫోటో కూడా అటువంటిదే. రక్తపు మడుగులో పడి ఉన్న పులి మీద కూర్చొని పిడికిలితో తన తలను ఆ వేటగాడు ఎలా వంచుతున్నాడో చూడండి. ఇతనొక్కడే కాదు. వీళ్లది పెద్ద బ్యాచ్. వీళ్లంతా థాయిలాండ్, మలేషియాలో ఉన్న అడవుల్లో పులులను వేటాడుతారు. అదే వీళ్ల వృత్తి. వాటిని చంపి ఏం చేస్తారో తెలుసా? పులి అస్థిపంజరానికి అక్కడ డిమాండ్ ఎక్కువట. టైగర్ బోన్ లిక్వర్ అని ఓ హెల్త్ మెడిసిన్ అక్కడ తయారు చేస్తారట. దాన్ని పులి ఎముకలతో తయారు చేస్తారట. దానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు.. దాని ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందట. పులి అస్థిపంజరంతో పాటు ఎలుగుబంటి కాలి గోర్లకు కూడా ఫుల్లు డిమాండ్ అట.

పులుల వేటపై ఎప్పటి నుంచో నిఘా ఉంచిన థాయ్ పోలీసులు.. తాజాగా వియత్నాంకు చెందిన వేటగాళ్ల గ్యాంగ్‌ను పట్టుకున్నారు. వారు థాయిలాండ్, మలేషియా బార్డర్లలో పులులను వేటాడుతారు. వాటిని చంపి వాటిని అస్థిపంజరంలా తయారు చేసి.. ఆ అస్థిపంజరాలను మెడిసిన్ కోసం అమ్మేస్తారు. వాళ్ల నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను, పులి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్‌ను చెక్ చేయగా.. ఇలా ఓ వేటగాడు.. పులిపై కూర్చున ఫోటో కనిపించింది. ఆ ఫోటో, పులి అస్థిపంజరం ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఆ వేటగాళ్లను ఉరితీయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మిగితా గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

8243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles