మోదీ కుర్తా పైజామాపై జోకులే జోకులు!

Tue,November 14, 2017 12:12 PM

PM Modis Kurta Pyjama draws memes from Twitterati

మనీలా: ఎక్కడికెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీ తన డ్రెస్సింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కాస్ట్‌లీ సూట్ వేసినా, భారత సాంప్రదాయ దుస్తులైనా అందరిలోనూ ప్రత్యేకంగా నిలవాలని చూస్తారు. ఏషియాన్ సదస్సులోనూ మోదీ ఇలా స్పెషల్‌గా కనిపించారు. ఇతర దేశాధినేతలంతా సూటు బూటు వేసుకొని వస్తే మోదీ మాత్రం కుర్తాపైజామాలో వచ్చారు. గ్రూప్ ఫొటోలో ఆయన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మోదీతోపాటు ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు డ్యుటెర్టి కూడా సూటు వేసుకోకుండా సాధారణ దుస్తుల్లో వచ్చారు. అయితే మోదీ డ్రెస్‌పై ట్విట్టర్‌లో జోకులు పేలాయి. వెడ్డింగ్ ఉందని వస్తే ఇక్కడ రిసెప్షన్ ఉందే అని ఒకరు.. బర్త్ డే రోజు సివిల్ యూనిఫామ్‌లో వచ్చినట్లుందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరైతే ఇండియాలో నల్లధనం ఉన్నవారు, తెల్లధనం ఉన్నవారంటూ సెటైర్ వేశారు.










7070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS