తజకిస్థాన్,బెలారస్ దేశాధినేతలను కలిసిన మోడీ

Fri,June 24, 2016 06:18 PM

PM Modi meets Presidents of Tajikistan, Belarus


తాష్కెంట్: ప్రధాని నరేంద్రమోడీ తాష్కెంట్ పర్యటనలో భాగంగా తజకిస్థాన్, బెలారస్ దేశాధినేతలను కలిశారు. ప్రధాని మోడీ తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమొమలీ రెహమాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అలెగ్జాండర్ తో భారత్, బెలారస్ ల మధ్య 25 ఏళ్లుగా కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాల అంశంపై చర్చించారు.

అనంతరం ఎమొమలీ రెహమాన్‌తో సమావేశమై తజకిస్థాన్, భారత్‌ల మధ్య సత్సంబంధాలు, శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, ఇతర కీలక అంశాలపై చర్చించారు.

1481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles