మన బంధం బలమైనది.. ట్రంప్‌తో మోదీ

Mon,November 13, 2017 03:02 PM

PM Modi meets american President Donald Trump on the sidelines of ASEAN Summit

మనీలా: ఏషియాన్ సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇండియా, అమెరికా మధ్య బంధం రోజురోజుకూ బలోపేతమవుతున్నదని మోదీ అన్నారు. ఆసియా అభివృద్ధి కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయని ఆయన స్పష్టంచేశారు. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమెలా అన్న అంశంతోపాటు పలు కీలక విషయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మోదీ మంచి స్నేహితుడయ్యారని, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఇద్దరం కలిసి ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని, భవిష్యత్తులోనూ కలిసి పనిచేస్తామని చెప్పారు.
2571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS