ఎప్పుడూ ఆ ఐపీఎల్ మ్యాచ్‌లేనా? ఈ మ్యాచ్ కూడా చూసి కాసేపు రిలాక్స్ అవండి..!

Thu,May 9, 2019 07:11 PM

Playing cricket on a sand bar video goes viral

దేశం మొత్తం ఓవైపు లోక్‌సభ ఎన్నికల ఫీవర్ నడుస్తుంటే.. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల ఫీవర్ నడుస్తోంది. అవును.. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఐపీఎల్‌లో ఎవరు విన్ అవుతారు.. అనే మాటలే. అయితే.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది కూడా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోనే. కాకపోతే.. ఆ మ్యాచ్‌ను స్టేడియాల్లో ఆడరు. సముద్రం మధ్యలో ఆడుతారు. అలా ఎలా అనే డౌట్ మీకు వచ్చే ఉంటది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మీరేమీ టెన్షన్ పడకండి.

సాండ్‌బార్‌లో వాళ్లు క్రికెట్ ఆడుతారు. అదేదో ఆషామాషీ క్రికెట్ అనుకునేరు. ఐపీఎల్ కంటే ఎక్కువ క్రేజ్ ఆ మ్యాచ్‌కి. సబ్‌మెరైన్ క్రికెట్ క్లబ్ వాళ్లు అక్కడ క్రికెట్‌ను నిర్వహిస్తారు. గెలిచిన వాళ్లకు సబ్ మెరైన్ ట్రోఫీ కూడా ఇస్తారు. సంవత్సరానికి రెండు సార్లు అక్కడ ట్రోఫీ జరుగుతుంది. సముద్రం మధ్యలో ఇసుకతో రూపొందిన రాళ్లనే సాండ్ బార్ అంటారు. అక్కడే వీళ్లు క్రికెట్ ఆడేది. ఈ సాండ్ బార్ న్యూజిలాండ్‌లో ఉంది. అలలు ఎక్కవగా ఉన్న సమయంలో కాకుండా.. అలలు తక్కువగా ఉన్నప్పుడే అక్కడ క్రికెట్ ఆడుతారు. కానీ.. సముద్రం మధ్యలో కాలికి అలలు తగులుతుంటూఉంటే.. క్రికెట్ ఆడటం.. ఎలా ఉంటుంది.. అబ్బో.. ఆడేవాళ్లకే కాదు.. చూసే వాళ్లకు కూడా మస్తు మజా అంటారా? ఎస్.. మస్తు మజా వస్తది. మీకు ఇంకో విషయం చెప్పడం మరిచిపోయా.. ఆకాశం నుంచి చూస్తే.. ఆ సాండ్ బార్ ఎలా ఉంటదో తెలుసా.. అచ్చం క్రికెట్ పిచ్‌లా ఉంటది. అందుకే అక్కడ క్రికెట్ ఆడటం ప్రారంభించారు కాబోలు. దానికి సంబంధించిన వీడియో చూస్తారా? మీరు మైమరిచిపోతారు ఆ వీడియో చూస్తే.


7126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles