సూడాన్‌లో కూలిన విమానం : 44 మంది మృతి!

Mon,March 20, 2017 09:37 PM

జుబా : దక్షిణ సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ సుప్రీమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 44 మందితో వెళ్తున్నది. అయితే వావ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా రన్‌వేను విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడగా.. మిగతా వారంతా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులతో ఐదుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. మృతులపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. విమానం దక్షిణ సూడాన్ రాజధాని జుబా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే విమానం తోక మినహాయిస్తే మిగతా భాగమంతా కాలిపోయింది.731

More News

మరిన్ని వార్తలు...