తిమింగలం ఆకారంలో ఉన్న విమానాన్ని చూశారా?.. వైరల్ ఫోటో

Fri,July 20, 2018 02:15 PM

Plane that looks like a whale charms the internet

తిమింగలం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా? అంత భారీ తిమింగలాలు సముద్రంలో అప్పుడప్పుడూ షిప్పుల్లో వెళ్లేవాళ్లకు దర్శనమిస్తుంటాయి. అయితే.. అచ్చం తిమింగలం ఆకారంలో ఓ విమానాన్ని తయారు చేశారు. చిరునవ్వు చిందిస్తున్న తిమింగలం ఆకారంలో ఉంటుంది ఆ విమానం. దానిపేరు ఎయిర్‌బస్ బెలుగాఎక్స్‌ఎల్. ఇక.. ఆ విమానం తన మొట్టమొదటి ప్రయాణాన్ని సౌత్ ఫ్రాన్స్‌లోని బ్లాగ్‌నక్‌లో ప్రారంభించింది.బెలుగా తిమింగలం ఆకారంలో దీన్ని తయారు చేశారు కాబట్టే దీనికి బెలుగా అని నామకరణం చేశారు. అయితే.. తన మొట్టమొదటి ప్రయాణం సందర్భంగా ఈ విమానాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఎయిర్‌బస్ కంపెనీ. దీంతో ఆ ఫోటోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవడమే కాదు.. తమ శైలిలో స్పందించి కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక.. తన మొదటి ప్రయాణం నాలుగు గంటలా 11 నిమిషాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ విమానం.. 10 నెలల్లో మరో 600 గంటలు ప్రయాణం చేస్తే అప్పుడు దానికి టైప్ సర్టిఫికేషన్ జారీ చేస్తారట. దాంతో 2019 నుంచి తిమింగలం విమానం ప్రయాణికులను ఎక్కించుకోనుంది.2279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles