వైరల్ ఫోటోలు: హార్రర్‌ను తలపిస్తున్న ఫ్యామిలీ ఫోటోలు!

Wed,January 17, 2018 04:57 PM

Photoshop fail photos goes viral on social media

ఫోటోషాప్ పుణ్యమా అని.. ఇప్పుడు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని జనరేషన్ ఇది. రీసెంట్‌గా ఓ ఫ్యామిలీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. యూఎస్‌లోని మిస్సౌరికి చెందిన ఓ ఫ్యామిలీ తమ ఫ్యామిలీ ఫోటో తీసుకుందామని ఓ ఫోటోగ్రాఫర్‌ను పిలిచింది. సూపర్బ్‌గా ఫోజులు ఇచ్చి మరీ.. ఫోటోలు దిగిన ఆ ఫ్యామిలీ.. చివరకు ఆ ఫోటోలను ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చి ఇచ్చాక చూసి షాక్ అయింది.

ఫోటోషాప్‌లో చిన్న తేడా రావడంతో వాళ్ల ముఖాలు కాస్త దెయ్యం మాదిరిగా మారడంతో వాళ్ల ఫోటోలు చూసి వాళ్లే భయపడ్డారు. ఇక.. హార్రర్‌ను తలపించే ఆ ఫోటోలను ఆ ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ హడావుడి చేస్తున్నాయి. జనవరి 13న ఆ ఫోటోలను పోస్ట్ చేయగా.. ఇప్పటికే 4 లక్షల షేర్లు నమోదయ్యాయి. అంతే కాదు.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు.. తెగ నవ్వుకుంటున్నారు.

'నా జీవితంలో ఇంతవరకు నేను ఇంతలా నవ్వింది లేదు... నన్ను ఇంతలా నవ్వించిన ఫోటోలకు చాలా థాంక్స్..' అంటూ ఓ నెటిజన్ కామెంటాడు. ఇలా.. చాలా మంది తెగ నవ్వేశామని కామెంట్లు చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.


5111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS