ఫోటో ఒకటే.. కానీ నెటిజన్లను ఫిదా చేసేసింది..!

Sat,August 18, 2018 05:57 PM

Photo of newborn surrounded by IVF syringes goes viral

ఒకటే ఫోటో. కాని.. నెటిజన్లను పిండేసింది. వాళ్ల గుండెలను టచ్ చేసింది. అంతలా గుండెలు పిండేసిన ఫోటో ఏంటని అనుకుంటున్నారా? మీరు పైన చూస్తున్నారే.. అదే ఫోటో. ఒక్క ఫోటో వెయ్యి పదాలతో సమానం అన్న సామెతను ఈ ఫోటో గుర్తుకు తెస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంతకీ అది ఏం ఫోటోనో అర్థమయిందా? బేబీ మధ్యలో ఉన్నాడు. చుట్టూ హార్ట్ సింబల్‌తో కూడిన సిరంజీలు ఉన్నాయి. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది ప్రస్తుతం. కానీ.. ఆ బేబీకి, హార్ట్ సింబల్‌కు, సిరంజీలకు ఏంటి సంబంధం అని నెత్తిగోక్కోకండి. కాస్త శ్రద్ధ కనబరిస్తే దాని పరమార్థం ఒంటబడుతుంది. సరే.. లోతుగా తెలుసుకుందాం పదండి..

ఐవీఎఫ్.. అంటే తెలుసు కదా. . ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అంటే ఇది పిల్లలు పుట్టని వాళ్లకు పిల్లలు పుట్టేలా చేసే ఓ పద్ధతి. ఐయూఐ అంటే తెలుసా? ఇంట్రాటరైన్ ఇన్‌సెమినేషన్ దాని అర్థం. ఇది కూడా అంతే సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే.. పాట్రిసియా ఓ నీల్, కింబెర్లీ అనే దంపతులకు పెళ్లయి చాలా రోజులు అయినా పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే వాళ్లు ఇద్దరూ మహిళలే. అవును. లెస్బియన్లు వాళ్లు. ఎలాగైనా పిల్లలను కనాలనుకున్నారు. దీంతో వాళ్లు ఐయూఐ పద్ధతిని ఎంచుకున్నారు. కానీ.. అది బెడిసి కొట్టింది. రెండుసార్లు ఐయూఐ ఫెయిల్ అయింది. దీంతో వాళ్లు ఐవీఎఫ్ పద్ధతిన బిడ్డను కనాలనుకున్నారు. ఐవీఎఫ్ కూడా చాలా సార్లు ఫెయిల్ అయింది. చాలా సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇక వద్దులే పిల్లల్ని మనం కనలేం అని వాళ్లు అనుకున్న సమయంలో పాట్రిసియా నెలతప్పింది. కాని.. లోపల పిండం పరిస్థితి ఏం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. ప్రతి రోజు ఓ గండంలా గడిచింది వాళ్లకు. చివరకు ఆగస్టు 3, 2018 న పాట్రిసియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

4 సంవత్సరాల కల ఇవాళ నెరవేరిందని.. బేబీ కోసం వాళ్లు ఉపయోగించిన సిరంజీలన్నింటినీ దాచి.. వాటిని హార్ట్ ఆకారంలో పేర్చి ఆ బేబీని మధ్యలో పడుకోబెట్టి ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక.. ఏదో సరదాకు చేసిన ప్రయత్నం తమను సోషల్ మీడియాలో ఫేమస్ చేసిందని.. ఆ ఫోటో ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదని ఆ దంపతులు తెగ ఆనంద పడ్డారు. బేబీ పుట్టిన వేళా విశేషం.. ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు ఆ దంపతులు.

5258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles