మా పని మనిషిని వేధించాను.. దేశాధ్యక్షుడి సంచలన ప్రకటన

Sun,December 30, 2018 03:25 PM

మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. తాను టీనేజర్‌గా ఉన్న సమయంలో ఇంట్లో పని మనిషిని లైంగికంగా వేధించినట్లు చెప్పారు. ఆమె తన రూమ్‌లో పడుకున్న సమయంలో దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పడం విశేషం. ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆయన వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, అత్యాచార యత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. మహిళలపై తరచూ లైంగిక సంబంధ వ్యాఖ్యలు చేయడం డ్యుటెర్టికి అలవాటే. గతంలోనూ తాను ఓ ఆస్ట్రేలియన్ మిషనరీని అత్యాచారం చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.

హైస్కూల్‌లో ఉన్నపుడు ఓ పాస్టర్ దగ్గర తాను అంగీకరించిన తప్పును తాజాగా డ్యుటెర్టి బయటపెట్టారు. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మా ఇంట్లో పని మనిషిగా ఉన్న మహిళ రూమ్‌లోకి వెళ్లాను. ఆ సమయంలో ఆమె పడుకొని ఉంది. ఆమె దగ్గరికి వెళ్లి అసభ్యకరంగా తాకాను. ఆమెకు మెలుకువ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత కూడా అలాగే మరోసారి వెళ్లి ఆమెను తాకడానికి ప్రయత్నించాను అని డ్యుటెర్టి తెలిపారు. ఇది అత్యాచారానికి ప్రయత్నించడమే అవుతుందని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని మహిళ హక్కుల రాజకీయ పార్టీ గాబ్రియేలా డిమాండ్ చేసింది.

3674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles