ఆడవాళ్లను అక్కడ కాల్చండి.. నోరు పారేసుకున్న డ్యుటెర్టి!

Tue,February 13, 2018 03:52 PM

Philippines president Rodrigo Duterte orders army shoot women rebels at Genitals

మనీలాః ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి మరోసారి నోరు జారారు. ఆడవాళ్లపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. దేశంలోని మహిళా కమ్యూనిస్ట్ రెబల్స్‌ను మర్మాంగాల దగ్గర కాల్చండని ఆయన ఆర్మీకి ఆదేశాలు జారీ చేయడాన్ని మానవ హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది మహిళల పట్ల లైంగిక దాడులను ప్రోత్సహించినట్లుగా ఉన్నదని ఆరోపిస్తున్నాయి. మహిళల పట్ల డ్యుటెర్టి ప్రదర్శిస్తున్న తీరుకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆ సంఘాలు అంటున్నాయి. ప్రపంచంలో ఎవరూ పాల్పడని మానవ హక్కుల ఉల్లంఘనలకు డ్యుటెర్టి పాల్పడుతున్నారని దేశంలోని లెఫ్ట్ గ్రూప్ కారాపటన్ ఆరోపించింది. తన నోరు అస్సలు మంచిది కాదని, హుందాగా ఉండటానికి తానేమీ రాజనీతిజ్ఞుడిని కానని డ్యుటెర్టియే చెప్పడం గమనార్హం. అసలు సమస్య ఏంటంటే.. తాను ఎన్నికల్లో గెలవడమేనని ఆయన అన్నారు. అధ్యక్ష పీఠం ఎక్కగానే దేశంలోని వేల మంది డ్రగ్ స్మగ్లర్లను నడిరోడ్డుపై కాల్చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు డ్యుటెర్టి.

3008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS