పెట్రోల్ బంక్‌లో జరిగిన ప్రమాదం చూశారా?..వీడియో

Fri,October 12, 2018 06:48 PM

petrol Pump Go Up In Flames After Car Pulls Away Too Soon

పెట్రోల్ బంకుల్లో సరైన నియమనిబంధనలు పాటించకపోతే, ముందుజాగ్రత్తలు తీసుకోనట్లెతే అది పెద్ద ప్రమాదానికే దారి తీసే అవకాశముంటుంది. న్యూజెర్సీ పెట్రోల్ బంక్ రెప్పపాటు క్షణంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే బంక్ స్టాఫ్అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ జరుగలేదు.

బంక్‌లోకి పెట్రోల్ కోసం ఓ వాహనం వచ్చింది. పెట్రోల్ కొట్టించాక డ్రైవర్ వాహనాన్ని ముందుకు తీశాడు. బంక్‌లోని ఫిల్లింగ్ ట్యాంక్ పైపు (పెట్రోల్ కొట్టేది) కారులో పెట్రోల్ ట్యాంక్‌లోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని డ్రైవర్ గమనించలేదు. డ్రైవర్ తనతోపాటు ఫిల్లింగ్ ట్యాంక్‌ను ఈడ్చుకెళ్లాడు. దీంతో ఒక్కసారిగా ఫిల్లింగ్ ట్యాంక్ పైకి లేచి..పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఒకరు సేఫ్టీ గ్యాస్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అందరిని అప్రమత్తం చేసి ప్రమాదం జరుగకుండా చూశాడు. ఈ ఘటన అందరికి ఓ హెచ్చరికలా పని చేయాలని భావించిన హాకెన్‌సాక్ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


4837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS