కారుని రివర్స్‌లో డ్రైవ్ చేసిన పెట్‌డాగ్..వీడియో వైరల్

Wed,November 27, 2019 02:13 PM


కారులో ఇంధనం కొట్టించడానికి ఓ వ్యక్తి తన వాహనాన్ని బంక్ వద్దకు తీసుకెళ్లాడు. బంక్‌లోకి వెళ్లి వాహనంలో గ్యాస్ కొట్టించాలనుకుంటుండగా హఠాత్తుగా కారు వెనుకకు కదిలింది. ఏం జరుగుతుందో గమనించేలోపే ఆ కారు అలా రివర్స్‌లో బంక్‌ను దాటి నాలుగు లేన్ రోడ్డు మీదుగా వెళ్తుంది. ఇది గమనించిన యజమాని ఆ కారును ఆపేందుకు దాని వెంట పరుగెత్తి కింద పడింది. ఇంతకీ ఆ కారు ఎలా కదిలింది..అనుకుంటున్నారా..? కారు అలా వెళ్లడానికి కారణం అందులో ఉన్న పెట్‌డాగ్.


5 పౌండ్ల బరువున్న కుక్క పిల్ల పేరు చిహువాహువా. కుక్క పిల్ల స్టేరింగ్‌ను కదిలించడంతో కారు అలా ఆగకుండా వెనక్కి వెళ్లిపోయింది. అయితే కారు రోడ్డుకు అడ్డంగా వెళ్తున్న క్రమంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. సీసీటీవీ పుటేజీ ద్వారా పెట్‌డాగ్ వల్లే ఇలా జరిగిందని గుర్తించిన ైస్లెడెల్ పోలీసులు..వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది.

2000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles