మీది ఉమ్మడి ఫ్యామిలీనా.. అయితే మీరు సేఫ్..!

Fri,October 12, 2018 03:49 PM

People with more siblings less likely to get cancer

ఉమ్మడి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఓ పాతికేండ్లు వెనక్కి వెళ్లాల్సిందే. ఆరోజుల్లో తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. అంతా కలిసే ఉండేవారు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా.. హాయిగా జీవించేవారు. అందుకే కాబోలు అప్పటి మనుషులు చాలా గట్టిమనుషులని అంతా అనేవారు. వాళ్లు ఎక్కువకాలం బతికేవారు. ఉమ్మడి ఫ్యామిలీలో ఉండే మజాయే వేరు.

కట్ చేస్తే.. ఇది అంతా టెక్నాలజీ యుగం బాస్. ఉమ్మడి ఫ్యామిలీ లేదు గిమ్మడి ఫ్యామిలీ లేదు. ఫ్యామిలీ అంటే భర్త, భార్య, కొడుకు, కూతురు లేదా ఎవరో ఒకరు. అంతే ఉంటే ముగ్గురు లేదా నలుగురు.. పిల్లలు చదువంటూ హాస్టల్‌లో ఉంటే ఇక ఉండేది భర్త, భార్య. రోజూ వాళ్లిద్దరు ఒకరి ముఖం మరొకరు చూసుకోవడం తప్పితే చేసేదేమీ ఉండదు.

మరోసారి కట్ చేస్తే.. ఉమ్మడి ఫ్యామిలీని ఎంజాయ్ చేసేవారికి క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా తక్కువంట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. రీసెర్చ్ చేసి మరీ చెబుతున్నారు వాళ్లు.

స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన మెడిసిన్ ప్రొఫెసర్స్ ఈ రీసెర్చ్‌ను చేశారు. ఫ్యామిలీలో ఉంటే వ్యక్తుల సంఖ్యను బట్టి వ్యాధి వచ్చే అవకాశాలను పరిశోధించారు. దీంతో ఎంత తక్కువ మంది ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని వారు ఈ పరిశోధన ద్వారా గ్రహించారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లులకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. ఉమ్మడి కుటుంబంలో ఉండే వ్యక్తులు ఒంటరితనం ఎక్కువగా ఫీల్ కారని.. దీంతో వాళ్ల మనసు ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండటంతో వాళ్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ప‌నిచేస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దీంతో క్యాన్సర్ కారకాలను వాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ‌ట‌. ఉమ్మ‌డి ఫ్యామిలీ వ‌ల్ల ఎన్నో లాభాలుంటాయ‌ని విన్నాం కానీ.. ఇలా క్యాన్స‌ర్ ను కూడా ఎదుర్కోవ‌చ్చ‌న్న‌మాట‌.

2768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS