కొత్త చాలెంజ్ .. సెల్ఫీ విత్ బొద్దింక.. ట్రై చేస్తారా?

Sun,May 12, 2019 05:36 PM

ఈ జనరేషన్‌ను సోషల్ మీడియా శాసిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి యూత్‌కు సోషల్ మీడియానే ప్రపంచం. యూత్ ఏంది.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. జియో ప్రభంజనం, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. నేటి జనరేషన్‌ను టెక్నాలజీకి అతుక్కుపోయేలా చేసింది.

మరోవైపు సోషల్ మీడియాలో ఆ చాలెంజ్‌లు.. ఈ చాలెంజ్‌లు అంటూ హల్‌చల్ చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఐస్ బకెట్ చాలెంజ్, కికి చాలెంజ్, బ్లూవేల్ చాలెంజ్ లాంటి వాటిని చూశాం మనం. తాజాగా బొద్దింకల చాలెంజ్ అట. అవును.. దాన్నే సెల్ఫీ విత్ కాక్రోచ్ లేదా బొద్దింకలతో ఫోటో అని పిలుస్తున్నారు.

ఈ చాలెంజ్‌లో భాగంగా.. బొద్దింకను ముఖం మీద వేసుకొని ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి కాక్రోచ్‌చాలెంజ్ హాష్‌టాగ్‌ను జత చేయాలి. ఒక్క బొద్దింక అయినా పర్లేదు.. రెండు మూడు బొద్దింకలయినా పర్లేదు.. కాకపోతే వాటిని ముఖం మీద ఉంచి ఫోటో తీయాలి.

ఏప్రిల్ 20న ఈ చాలెంజ్‌ను మయన్మార్‌కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు స్టార్ట్ చేశాడు. కొత్త చాలెంజ్ బాస్.. మీరూ ట్రై చేస్తారా? అని మనోడు క్యాప్షన్ పెట్టాక కూడా నెటిజన్లు ఊరుకుంటారా? వెంటనే వాళ్లు కూడా బొద్దింకను దొరకబట్టి మరీ.. తమ ముఖం మీద వేసుకొని దానితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చాలెంజ్ ప్రస్తుతం మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో వైరల్‌గా మారింది.
2226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles