చెట్లకు వింటర్ జాకెట్లు..

Wed,November 27, 2019 04:09 PM


టర్కీ, బల్గేరియాలో నిరాశ్రయులైన వారి కోసం చేపట్టిన వినూత్న ఆలోచన ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఉండేందుకు ఇల్లు లేకుండా, రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో బతుకెళ్లదీసే పేదప్రజలకు చలికాలంలో పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఎముకలు కొరికే చలి బారి నుంచి పేదప్రజలను కాపాడేందుకు అక్కడి వాసులు కొంతమంది వీధుల్లో ఉన్న చెట్లకు వింటర్ జాకెట్లు తొడిగారు. ఎవరైతే నిరాశ్రయులున్నారో వారు ఆ చెట్టుకు తొడిగి ఉన్న జాకెట్‌ను తీసుకెళ్లవచ్చు.


ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్షగోయెంకా గతంలో ఈ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. చలికాలంలో టర్కీ, బల్లేరియాలో ప్రజలు తమ దగ్గరున్న జాకెట్లను నిరాశ్రయులైన పేదవారికి అందించేందుకు ఇలా చేస్తారంటూ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు టర్కీలో ఓ బేకరీ షాపు యజమాని బ్రెడ్ బాక్స్‌ను రోడ్డు బయట పెట్టాడు. తినడానికి తిండిలేక అలమటించేవారు ఈ బ్రెడ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చని దానిపై రాశాడు. పేదవారికి కట్టుకునేందుకు దుస్తులు అందించే కార్యక్రమాలు ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. షకీర్ అనే నెటిజన్ ఈ ఫొటోలను షేర్ చేసుకున్నాడు. మా దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామంటూ రాజస్థాన్‌లోని జైపూర్ వాసి ఒకరు కొన్ని ఫొటోలను షేర్ చేశాడు.

2724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles