కారులో నుంచి దూకుతూ డ్యాన్స్‌ చేయాలి.. ఈ చాలెంజ్‌కు మీరు రెడీనా?

Thu,July 19, 2018 03:37 PM

People are jumping out of moving cars to complete an internet challenge

ఇంటర్నెట్.. గంటలు గంటలు అందులో టైమ్ పాస్ చేయాలంటే ఎలా? ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే ఇంటర్నెట్‌లో ఏదో ఒక చాలెంజ్‌లను స్టార్ట్ చేస్తుంటారు. ఇదివరకు ఐస్ బకెట్ చాలెంజ్, బ్లూ వేల్ గేమ్, దాల్చిన చెక్క చాలెంజ్.. ఇలా చాలా చాలెంజ్‌లు వచ్చాయి. ఇప్పుడు కారు చాలెంజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ చాలెంజ్ ప్రకారం.. కెనెడియన్ రాపర్ డ్రేక్ కొత్త ఆల్బమ్ స్కార్పియన్‌లోని ఇన్ మై ఫీలింగ్స్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కారు నుంచి దిగాలి. మళ్లీ అలాగే డ్యాన్స్ చేస్తూ కారెక్కాలి. అలా చేస్తూ వీడియో తీసి ఇన్‌మైఫీలింగ్స్‌ హాష్ టాగ్ లేదా కేకేచాలెంజ్ హాష్‌టాగ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇక ఈ చాలెంజ్‌ను ది షిగ్గీ షో కమెడియన్ నెటిజన్లకు విసిరాడు. అతడు డ్యాన్స్ వేసిన వీడియోను షేర్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసి సవాల్ విసిరాడు. దీంతో కొంతమంది ఈ చాలెంజ్‌ను ట్రై చేయబోయి కింద పడటం, పడినా లేసి మళ్లీ డ్యాన్స్ చేయడం ఆధ్యంతం నవ్వు తెప్పిస్తుంది. దీంతో.. ఈ చాలెంజ్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ చాలెంజ్ వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి.

#Mood : KEKE Do You Love Me ? 😂😂😂 @champagnepapi #DoTheShiggy #InMyFeelings

A post shared by Shoker🃏 (@theshiggyshow) on


3176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles