ఇండియా, పాకిస్థాన్ మధ్య శాంతే వాజ్‌పేయికి నిజమైన నివాళి!

Fri,August 17, 2018 03:25 PM

Peace between India and Pakistan is the real way to honour Vajpayee says Imran Khan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కాబోయే ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి నివాళులర్పించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొల్పడమే ఆయనకు నిజమైన నివాళి అని ఇమ్రాన్ అన్నారు. ఉపఖండంలో అత్యంత గౌరవించదగిన రాజకీయత నేత వాజ్‌పేయి అని, ఇండోపాక్ సంబంధాలను మెరుగుపరచడం కోసం ఆయన చేసిన కృషిని ఎప్పుడూ గుర్తుంచుకుంటారని ఆయన చెప్పారు. వాజ్‌పేయి మరణంతో ప్రస్తుతం దక్షిణాసియాలో ఓ రాజకీయ శూన్యత ఏర్పడిందని ఇమ్రాన్ అన్నారు.

రెండు దేశాల మధ్య విభేదాలు ఉండొచ్చుగానీ.. సరిహద్దుకు ఇరువైపుల ప్రజలూ శాంతి కోరుకుంటున్నారు. ఆ శాంతిని నెలకొల్పడం ద్వారా మాత్రమే వాజ్‌పేయికి మనం నిజమైన నివాళులు అర్పించగలం. వాజ్‌పేయిని కోల్పోయిన బాధలో ఉన్న భారతీయుల వెంటే నేనున్నాను అని ఇమ్రాన్ స్పష్టంచేశారు. ఓ రాజనీతిజ్ఞుడిగా ఇండియా, పాకిస్థాన్ సంబంధాల కోసం కృషి చేసిన నేతగా వాజ్‌పేయిని కొనియాడింది పాకిస్థాన్ విదేశాంగ శాఖ. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు 1999, ఫిబ్రవరి 19న బస్సులో వాజ్‌పేయి లాహోర్ వెళ్లారు. అక్కడ పాక్‌తో ఓ శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. వాజ్‌పేయికి వాఘా సరిహద్దు దగ్గర సాదరంగా ఆహ్వానం పలికారు.

1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS