మనిషి సూర్యుడిపైకి పంపుతున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ లాంచ్ ఆ రోజే!

Sun,April 8, 2018 01:28 PM

Parker Solar Probe to be launched in July 31 reveals NASA

వాషింగ్టన్: చంద్రుడు, సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల వేట ఓవైపు నడుస్తుండగానే నాసా సూర్యుడిపై కన్నేసింది. మానవ చరిత్రలో తొలిసారి సూర్యుడి అధ్యయనం కోసం ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఆ మిషన్ పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ ప్రతిష్టాత్మక మిషన్ లాంచ్‌కు జులై 31న ముహూర్తం ఖరారు చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇప్పటికే అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఫ్లోరిడాకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి డెల్టా ఫోర్ హెవీ లాంచ్ వెహికిల్ ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగికి ఎగరనుంది. ఈ మూడు నెలల పాటు ఫ్లోరిడాలోనే స్పేస్‌క్రాఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. దీనిని లాంచ్ చేసిన తర్వాత ఇది నేరుగా సూర్యుడి బయటి వాతావరణమైన కరోనాకు దగ్గరగా వెళ్లనుంది.

చరిత్రలో ఇప్పటి వరకు మనిషి రూపొందించిన ఏ స్పేస్‌క్రాఫ్ట్ అంత వరకు వెళ్లలేదు. సూర్యుడి వేడి, రేడియేషన్‌ను తట్టుకుంటూనే ఇది కరోనా గురించి అధ్యయనం చేస్తుంది. ఇందులో ఇంధనం నింపే ముందు చివరిగా స్పేస్‌క్రాఫ్ట్‌కు అవసరమైన రక్షణ కవచం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అమర్చుతారు. సూర్యుడి వేడిని తట్టుకునేలా తయారు చేసిన ఈ రక్షణ కవచం ఓ మైలురాయిగా చెప్పవచ్చు. పార్కర్ సోలార్ ప్రోబ్ కరోనాకు 98 ల‌క్ష‌ల‌ కిలోమీటర్ల దగ్గరిగా వెళ్లనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ మిషన్ మొత్తం జీవితకాలం ఏడేళ్లు. ఇది సూర్యుడి గురించి ఇప్పటివరకు తెలియని విషయాలను వెల్లడించనుంది.

2979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles