భారత్ కూల్చిన పాక్ ఎఫ్-16 విమాన శకలాలు ఇవే

Thu,February 28, 2019 12:15 PM

న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మెరుపు దాడి చేసిన మరుసటి రోజే పాకిస్థాన్ భారత గగనతలంలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన మూడు ఎఫ్-16 ఫైటర్ జెట్స్ నియంత్రణ రేఖ దాటి రావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాటిని తరిమి కొట్టింది. ఈ క్రమంలో ఓ ఎఫ్-16 విమానాన్ని ఐఏఎఫ్ కూల్చేసింది. దానికి సంబంధించిన శకలాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కనిపించాయి. పాకిస్థాన్ 7 నార్తర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ కమాండింగ్ ఆఫీస్, ఇతర పాక్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది శకలాలను పరిశీలిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. బుధవారం ఈ విమానాన్ని కూల్చినట్లు భారత్ వెల్లడించిన విషయం తెలిసిందే. నౌషేరా సెక్టార్ సమీపంలో పాకిస్థాన్ భూభాగం వైపు ఈ విమానం కూలుతుండటాన్ని భారత బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత ఓ పారాషూట్ కూడా కనిపించింది. దీని ద్వారా పైలట్ విమానం నుంచి బయటపడినట్లు అనుమానిస్తున్నారు.


4155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles