యాపిల్ అంటే పండు అనుకొని లైవ్‌లో పప్పులో కాలేసిన న్యూస్ యాంకర్.. వైరల్ వీడియో

Mon,July 8, 2019 01:58 PM

Pakistani News Anchor Confuses Apple company logo With Fruit

మీ దగ్గర యాపిల్ ఉందా? నేనైతే యాపిల్ కొనడం కోసం సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ.. డబ్బులు సరిపోవట్లేవు. హేయ్.. నీ దగ్గర యాపిల్ ఉందంటే.. నువ్వు చాలా రిచ్... అన్నమాట. అంటూ ఫ్రెండ్స్ మధ్య బాత్‌కానీలు సాగుతుంటాయి. ఒక యాపిల్ కొనడానికి అంత ఖర్చేమీ కాదు కదా. ఓ 20 రూపాయలు పెడితే వస్తుంది. దానికి, రిచ్‌కి ఏంటి తేడా అని అంటే.. మీరు కూడా పప్పులో కాలేసినట్టే. అవును.. మనం మాట్లాడుకునేది తినే యాపిల్ గురించి కాదు.. యాపిల్ కంపెనీ గురించి.

ఓ న్యూస్ యాంకర్ కూడా యాపిల్ అనగానే తినే పండు అనుకొని పప్పులో కాలేసింది పాపం. లైవ్ షోలో అడ్డంగా బుక్కయింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే... పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ యాంకర్ ఓ గెస్ట్‌తో లైవ్ షో చేస్తోంది. ఇద్దరి మధ్యా చర్చ నడుస్తున్న సమయంలో.. గెస్ట్.. పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక స్థితి గురించి వివరిస్తున్నాడు. ఆ క్రమంలో పాకిస్థాన్ ఏడాది బడ్జెట్ కంటే కూడా ఒక్క యాపిల్ బిజినెస్ ఎక్కువగా ఉంటుందంటూ చెప్పాడు. ఆయన చెప్పిన విషయాన్నే ఉటంకిస్తూ.. ఆ యాంకర్.. అవును.. నేనూ విన్నాను. ఈరోజుల్లో యాపిల్ ఖరీదు చాలా ఎక్కువైంది.. అంటూ చెప్పింది. గెస్ట్ చెప్పిందేమో..యాపిల్ కంపెనీ గురించి.. ఆమె మాట్లాడింది మాత్రం యాపిల్ పండు గురించి. ఈ విషయాన్ని గ్రహించిన గెస్ట్.. నేను కంపెనీ గురించి మాట్లాడుతున్నానంటూ ఆమెకు సర్దిచెప్పాడు.

అయితే.. అది లైవ్ షో కావడంతో అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తర్వాత షోను కంటిన్యూ చేశారు. ఆ విషయాన్నే మరిచిపోయారు. కానీ.. జర్నలిస్టు నైలా ఇనాయత్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేనా.. నెటిజన్లు ఊరుకుంటారా? అయ్యో.. యాంకరమ్మా.. కాస్త వేరేవాళ్లు చెప్పేది పూర్తిగా వినాలమ్మా.. లైవ్‌లో ఇలా అడ్డంగా బుక్కయిపోతివి. యాపిల్ కంపెనీ గురించి తెలియకుండానే యాంకర్ ఎలా అయ్యావు. రోజు ఓ యాపిల్ తిను. అప్పుడైనా కాస్త బుద్ధి పెరుగుతుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
5294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles