నేను అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడూ.. జైషే భార‌త్‌లో దాడులు చేసింది..

Thu,March 7, 2019 09:37 AM

Pakistan used Jaish-e-Mohammed to carry attacks in India during my tenure also, says Pervez Musharraf

హైద‌రాబాద్: తాను దేశాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనూ జైషే ఉగ్ర‌వాద సంస్థ భార‌త్‌లో దాడులు చేసింద‌ని పాకిస్థాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ఆ దాడులు చేయించార‌న్నారు. పాక్‌కు చెందిన హ‌మ్ న్యూస్‌తో ముష‌ర్ర‌ఫ్ టెలిఫోన్ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంట‌ర్వ్యూలో ఈ అంశాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం పాక్ ప్ర‌భుత్వం జైషేపై తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ముష‌ర్ర‌ఫ్ ఆహ్వానించారు. 2003 డిసెంబ‌ర్‌లో రెండుసార్లు జైషే సంస్థ త‌న‌పై హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు ముష‌ర్ర‌ఫ్ తెలిపారు. అయితే 1999 నుంచి 2008 వ‌ర‌కు ముష‌ర్ర‌ఫ్ దేశాధ్య‌క్షుడిగా ఉన్నారు. మ‌రి ఆ స‌మ‌యంలో ఎందుకు జైషేపై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించారు. దానికి బ‌దులిస్తూ ఆ స‌మ‌యంలో ఇండో, పాక్ మ‌ధ్య త‌రుచూ ఉద్రిక్త ప‌రిస్థితులు ఉండేవ‌న్నారు. పాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు మాత్రం త‌రుచూ భార‌త్‌లో దాడులు చేయించేవ‌న్నారు. మ‌సూద్ అజ‌ర్ నేతృత్వంలోని జైషే సంస్థ .. ఇటీవ‌ల కాలంలో భార‌త్‌లో అనేక ఉగ్ర దాడుల‌కు పాల్ప‌డింది. పుల్వామా దాడికి కూడా తామే కార‌ణ‌మ‌ని ఆ సంస్థ ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే. ఆ దాడిలో 44 మంది జ‌వాన్లు మృతిచెందారు.

3284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles