పాక్‌లో 40వేల మంది మిలిటెంట్లు..

Wed,July 24, 2019 12:36 PM

Pakistan still has  40,000 militants, tells Imran Khan

హైద‌రాబాద్‌: త‌మ దేశంలో ఇంకా సుమారు 40 వేల మంది మిలిటెంట్లు ఉన్న‌ట్లు పాకిస్థాన్‌ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పీస్‌లో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆ తీవ్ర‌వాదులంతా ఆఫ్ఘ‌నిస్తాన్ లేదా క‌శ్మీర్‌లో శిక్ష‌ణ పొంది ఉంటార‌ని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధికారంలోకి రాక‌ముందు.. దేశంలో ఉన్న తీవ్ర‌వాదుల‌ను ఏరివేసేందుకు గ‌త ప్ర‌భుత్వాలు రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోయాయ‌న్నారు. 2014లో తాలిబ‌న్ మిలిటెంట్లు ఓ ఆర్మీ స్కూల్‌పై దాడి చేసి 150 మంది చిన్నారుల‌ను హ‌త‌మార్చారు. ఆ త‌ర్వాతే పాక్‌లోని రాజ‌కీయ పార్టీలు ఓ యాక్ష‌న్ ప్లాన్‌కు అంగీక‌రించాయ‌న్నారు. రాజ‌కీయ సంక‌ల్పం లేక‌పోవ‌డం వ‌ల్లే మిలిటెంట్లు రాజ్య‌మేలుతున్నార‌ని, ఇప్ప‌టికీ 40 వేల మంది ఉంటార‌ని ఇమ్రాన్ తెలిపారు. దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద సుమారు 40 మిలిటెంటు గ్రూపులు ఆప‌రేట్ చేస్తున్నాయ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వాలు బ‌ల‌హీనంగా ఉండ‌డం వ‌ల్ల‌.. ఆ ప్ర‌భుత్వాలు అమెరికాకు వాస్త‌వాన్ని ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాయ‌న్నారు.

1344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles