సిట్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న‌ పాక్ ప్ర‌ధాని

Mon,June 12, 2017 04:00 PM

Pakistan PM Nawaz Sharif to appear before Panama Papers probe panel on June 15

ఇస్లామాబాద్ : ప‌నామా పేప‌ర్స్‌ కేసులో పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ సంయుక్త ద‌ర్యాప్తు బృందం ముందు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రుకానున్నారు. ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కుటుంబ‌స‌భ్యులు మ‌నీల్యాండింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాంతో ష‌రీఫ్ అక్ర‌మాస్తుల కేసుపై సిట్ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఇటీవ‌ల ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఈ నెల 15వ తేదీన ష‌రీఫ్ సిట్ బృందం ముందు హాజ‌రుకానున్నారు. ఇస్లామాబాద్‌లో ఉన్న ఫెడ‌ర‌ల్ జ్యుడిషియ‌ల్ అకాడ‌మీ ముందు ఆయ‌న అన్ని డాక్యుమెంట్ల‌తో హాజ‌రుకావాల్సి ఉంటుంది. మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన ష‌రీఫ్ కుటుంబం లండ‌న్‌లోని పార్క్ లేన్ ప్రాంతంలో నాలుగు అపార్ట్‌మెంట్‌లు కొన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులోనే సిట్ ముందు హాజ‌రుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాల‌ను జారీ చేసింది. ఒక ద‌ర్యాప్తు సంస్థ ముందు హాజ‌రుకానున్న మొద‌టి పాక్ ప్ర‌ధానిగా ష‌రీఫ్ నిల‌వ‌నున్నారు.

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles