యుద్ధం మొద‌లైతే నా చేతిలో ఉండ‌దు.. మోదీ చేతిలో ఉండ‌దు

Wed,February 27, 2019 04:17 PM

హైద‌రాబాద్‌: భార‌త్‌ను మ‌రోసారి శాంతి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానిస్తున్నాని పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇవాళ ఆయ‌న దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒక‌వేళ భార‌త్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే, తాము తిప్పికొట్ట‌నున్న‌ట్లు ముందే చెప్పాన‌న్నారు. పుల్వామాలో దాడి జ‌రిగిన త‌ర్వాత .. భార‌త్‌ను శాంతి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించామ‌న్నారు. పుల్వామా దాడి ప‌ట్ల విచార‌ణ చేప‌డుతామ‌న్నారు. అయినా భార‌త్ దాడి చేస్తుందేమో అన్న ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నామ‌న్నారు. మీరు మా దేశంలోకి వ‌స్తే, మేం కూడా మీదేశంలోకి వ‌స్తామ‌ని ముందే చెప్పామ‌న్నారు. దానికి త‌గిన‌ట్లుగానే ఇవాళ మిగ్ 21 విమానాల‌ను కూల్చేశామ‌న్నారు. ఇక నుంచైనా మ‌న విచ‌క్ష‌ణ‌తోనే ముందుకు వెళ్దామ‌న్నారు. అన్ని యుద్ధాల్లో అంచ‌నాలు త‌ప్పాయ‌న్నారు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధ ఒక వారంలోనే ముగుస్తుంద‌నుకున్నారు, కానీ ఆరేండ్లు అది సాగింద‌న్నారు. ఉగ్ర‌వాదంపై యుద్ధం కూడా 17 ఏళ్లుగా కొన‌సాగుతోంద‌న్నారు. మీద‌గ్గ‌ర ఉన్న ఆయుధాలు, మా ద‌గ్గ‌ర ఆయుధాలు ఎన్ని ఉన్న‌యో తెలుసా, మ‌నం ఈ స‌మ‌యంలో త‌ప్పుగా యుద్ధ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చా, యుద్ధం మొద‌లైతే, ప‌రిస్థితి నా చేతిలో కానీ, మోదీ చేతిలో కానీ ఉండ‌ద‌న్నారు. పుల్వామా దాడితో ఎంత న‌ష్ట‌పోయామో మాకు తెలుసు, ఆ ఘ‌ట‌న‌లో మేం విచార‌ణ చేప‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఈ అంశంపై కూర్చుని మాట్లాడుకుందామ‌న్నారు.

6474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles