పాక్ పోలింగ్ బూత్ వద్ద పేలుడు : 31 మంది మృతి

Wed,July 25, 2018 12:19 PM

pakistan elections At least 22 killed and 30 injured in Quetta blast

క్వెట్టా : పాకిస్థాన్ ఎన్నికల్లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. రక్తపుటేరులు పారాయి. పోలింగ్ బూత్‌ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ బూత్ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన క్వెట్టాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 31 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా.. బూత్ బయట ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌లో సమీపంలో పేలని గ్రనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

2443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles