సుష్మాను ఎందుకు పిలిచారు.. ఆ మీటింగ్‌కు నేను రాను!

Fri,March 1, 2019 01:17 PM

Pakistan did not attend OIC meet at Dubai due to presence of Sushsma Swaraj

ఇస్లామాబాద్: ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సమావేశానికి తాను హాజరు కావడం లేదని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను గౌరవ అతిథిగా పిలవడంపై పాకిస్థాన్ నిరసన వ్యక్తం చేసింది. సుష్మాకు ఆహ్వానం పంపిన కారణంగానే తాను సమావేశానికి హాజరు కావడం లేదని ఖురేషీ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వరకు తాను సుష్మాతో సమావేశమయ్యే అవకాశమే లేదని ఖురేషీ తేల్చి చెప్పారు. అసలు ఓఐసీ వ్యవస్థాపక సభ్యుల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇది మా ఫోరమ్. మేము ఆ సమావేశానికి వెళ్లి పాకిస్థాన్ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాం. ఇండియా కనీసం ఓఐసీ అబ్జర్వర్ కూడా కాదు. ఆ దేశాన్ని తొలిసారి ఆహ్వానించారు. అయితే నేను సుష్మా స్వరాజ్‌తో సమావేశం మాత్రం నిర్వహించదలచుకోలేదు అని ఖురేషీ చెప్పారు. ఓఐసీకి సుష్మాను ఆహ్వానించడంపై ఇంతకుముందు కూడా ఖురేషీ అభ్యంతరం వ్యక్తం చేశారు.


3707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles