పుల్వామా దాడిలో జైషే పాత్ర లేదు : పాకిస్థాన్‌

Sat,March 2, 2019 11:59 AM

Pakistan defends JeM yet again, claims terror group not responsible for Pulwama attack

హైద‌రాబాద్: పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జ‌రిగిన ఆత్మాహుతి దాడి ప‌ట్ల పాకిస్థాన్ మంత్రి షా మెహ‌మూద్ ఖ‌రేషి స్పందించారు. ఆ దాడికి జైషే సంస్థ కార‌ణం కాదు అని ఆయ‌న అన్నారు. జైషే సంస్థ అధిప‌తి మ‌సూద్ అజ‌ర్ త‌మ దేశంలోనే ఉన్న‌ట్లు మొన్న చెప్పిన ఖురేషి.. ఇవాళ ఉగ్ర‌ఘ‌ట‌న అంశం ప‌ట్ల మాట మార్చారు. బీబీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదుల గురించి వివ‌రాలు అందిస్తేనే, పాక్ వారిపై చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఖురేషి చెప్పారు. పుల్వామా దాడి ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తామ‌ని, కానీ ఆ అంశంపై చ‌ర్చించేందుకు భార‌త్ ముందుకు రావాల‌న్నారు. రెండూ అణు సామ‌ర్థ్యం క‌లిగిన దేశాలు అని, మ‌రి ఇలాంటి దేశాలు యుద్ధానికి వెళ్ల‌వ‌చ్చా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జైషేనే పుల్వామా దాడి చేయించిన‌ట్లు ఆధారాలు లేవ‌న్నారు. ఆ సంస్థ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త ప్ర‌క‌టించ‌లేద‌న్నారు.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles