పాక్‌లో ఉగ్ర‌వేట‌, 39 మంది హ‌తం

Fri,February 17, 2017 07:03 PM

కరాచీ: పాకిస్థాన్‌లో పోలీసులు ఉగ్ర‌వేట మొద‌లుపెట్టారు. గురువారం సూఫీ మ‌సీదులో జ‌రిగిన పేలుడు త‌ర్వాత భారీ ఎత్తున మిలిటెంట్ల ఏరివేత జ‌రిగింది. దేశ‌వ్యాప్తంగా భ‌ద్ర‌తా ద‌ళాలు తీవ్ర‌వాదుల‌ను ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఇవాళ ఒక్క రోజే సుమారు 39 మంది ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు గురువారం జ‌రిపిన పేలుడులో సుమారు 80 మంది మృతిచెందారు. మ‌రో 250 మంది గాయ‌ప‌డ్డారు. సింధు ప్రాంతంలోని లాల్ షాహ‌బాజ్ మ‌సీదులో ఈ పేలుడు జ‌రిగిన విషయం తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగా పాక్ పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వ‌హిస్తున్నారు.

1869

More News

మరిన్ని వార్తలు...